బంధువుల మధ్య జరిగిన తగాదాలో తండ్రీకొడుకులను గాయపరిచిన ఘటన బొబ్బిలి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తారకరామాకాలనీకి చెందిన బొత్స రామారావు రెండో కుమారుడు లక్ష్మణరావుకు సీతానగరం మండలం కాశయ్యపేట గ్రామానికి చెందిన నందిత అనే యువతితో ఆరునెలల క్రితం వివాహమైంది. పె యింటర్‌గా పనిచేస్తున్న లక్ష్మణరావు తన భార్య నందితను నిత్యం వేధిస్తుండడంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. దీనితో నందిత తండ్రి కళింగపట్టపు పైడిరాజు, సోదరుడు దుర్గారావు మంగళవారం తారకరామాకాలనీకి వచ్చి లక్ష్మణరావును అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పైడిరాజు, దుర్గారావు కలిసి నందిత మామ బొత్స రామారావును, అతని పెద్దకుమారుడు కిశోర్‌ను బీరుసీసాతో కొట్టి గాయపరిచారు. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు.