మలికిపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ అగ్నికులక్షత్రియ ముఖ్య నాయకులు, యూత్ సభ్యులతో రాజోలు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు భేటీ అయ్యారు. బుధవారం రాజోలు మండలం తాటిపాకలో ఆయనను కలిసి పలు సమస్యలను విన్నవించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని గొల్లపల్లి అన్నారు.