టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బుధవారం హనుమాన్ జంక్షన్, బాపులపాడు మండలంలోని బిళ్లనపల్లి గ్రామంలోపర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వరి బిళ్లనపల్లిగ్రామానికి చేరుకుంటారు. కాగా, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎదురువాడ కిరణ్ (48), ఎదురువాడ బసవరావు (85) కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించేందుకు టీడీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.