రాష్ట్రంలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అందిస్తుందని విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. ఆమె మాట్లాడుతూ..... విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించి వచ్చే జూన్ లో విశాఖ లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు. విశాఖ ప్రాంతంపై జగనన్న ఉన్న ప్రేమ దీనితో వ్యక్తమవుతుందన్నారు. ప్రతీ ఇంటికీ సుపరిపాలనను డోర్ డెలివరీ చేస్తోన్న ప్రభుత్వం ఇది అన్నారు.