ఎన్నికల ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలని, అన్ని ప్రచార అనుమతులు నిర్దేశిత సమయంలో అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులన ఆదేశించారు. విజయవాడ ప్రధాన అధికారి కార్యాలయం నుండి బుధవారం సీ-విజిల్ యాప్, ఈఎస్ఎంఎస్ ఫిర్యాదులు, ఎంసిసి, ఫిర్యాదుల పరిష్కారం, ఎన్నికల సన్నద్ధత అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికలఅధికారిముఖేష్ మీనా నిర్వహించారు.