దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళ కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసే పథకాన్ని హామీ ఇస్తుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ చెప్పారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట లో గురువారం కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటి నాయకులతో జరిగిన సమావేశంలో గౌతమ్ పాల్గొన్నారు.