ఏప్రెల్ 14వ తేదీలోగా కొత్తగా ఓటు నమోదు కోసం ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి, అర్హులైనవారికి ఓటుహక్కు కల్పించడం జరుగుతుందన్నారు. ఏప్రెల్ 14 తరువాత కూడా ఓటుకోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, సరిపడా సమయం ఉండదన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.