రాజమహేంద్రవరం రూరల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగగా, వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణు రంగంలోకి దిగారు. కానీ ఆయనను రామ చంద్రపురం నుంచి ఇక్కడకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ కేవలం బలహీనవర్గాలనే ఒక నియోజకవర్గంలో ఉండనీయకుండా, ఇక్కడకు బదిలీ చేశారనే విమర్శ ఉంది. అంతేకాక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు పోటీ చేశారు. ఈసారి ఆయనకు సీటు దక్కలేదు. కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెండు దఫాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడో సారి ఇప్పుడు ఎన్నికలకు వెళుతున్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలతో నూ మంచి సంబంధాలు ఉన్న నేతగా ఆయనకు పేరుంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.