అల్లూరి జిల్లా, చింతూరు మండలం మల్లెతోట గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఐదు తాటాకిళ్లతో పాటు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. కాకవారి గుంపులో కాక శిరమయ్య ఇంటికి తొలుత ప్రమాదవశాత్తు నిప్పంటుకుని, ఆ ఇంట్లోని వంట గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న కాక ప్రసాద్, కాక సీతమ్మ, గొర్రె పిచ్చయ్య, ముచ్చిక మల్లయ్య, ముచ్చిక ముత్తమ్మ, ముచ్చిక బిగ్‌బాసుల ఇళ్లతో పాటు వంట ఇళ్లు, పశువుల పాకలు కాలిబూడిదయ్యాయి. బంగారం ఆభరణాలు, నగదు, గృహోపకరణాలు, ధాన్యం బస్తాలు, సర్టిఫికెట్లు దగ్ధమయ్యాయి. మొత్తం 15 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పీవో కావూరి చైతన్య వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసరాలను అందజేశారు.