విదేశీ పర్యాటకులను మోసగించిన ముగ్గురు వ్యక్తులను జైపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విదేశీ పర్యాటకులతో మోసాలకు పాల్పడినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు. డీసీపీ నార్త్ రాశి డోగ్రా ఆదేశాల మేరకు అదనపు డీసీపీ రాణు శర్మ, ఏసీపీ డాక్టర్ హేమంత్ జాఖర్, ఎస్హెచ్ఓ టూరిస్ట్ ధరమ్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం చర్యలు చేపట్టి కింగ్పిన్తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది.డిసెంబరు 3న బాధితురాలు జైపూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కేసులో ఇతర నిందితులు కూడా పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.