అనంతపురం నగరంలోని రుద్రంపేట లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను శనివారం అనంతపురం అర్బన్ పార్టీ కార్యకర్తలు కాల్చివేశారు. టీడీపీ తరుపున వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి టికెట్ దక్కక పోవడంతో ఈ నెల 29న రామ్ నగర్ లోని పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్ ను దగ్దం చేసిన విషయం విదితమే. కానీ శనివారం కూడా కార్యకర్తల్లో కోపం తగ్గకపోవడంతో రుద్రం పేట లో ఫర్నిచర్ ను దగ్దం చేశారు.