బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకోబోతున్నట్లు ఆర్థిక శాఖ చెబుతోంది. ఈ అప్పుతో ఏం చేస్తారని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి 2014 వరకు 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో మోదీ దాన్ని రూ.205 లక్షల కోట్లకు పెంచారు. ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు చేశారని ప్రశ్నించారు.