అప్పుల బాధ తాళలేక చాగల్లుకు చెందిన కౌలు రైతు బత్తిన శ్రీనివాస్(45) ఆత్మహత్య చేసుకున్నట్టు చాగల్లు ఎస్‌ఐ పి.నాగరాజు శుక్రవారం తెలిపారు. శ్రీనివాస్ వ్యవసాయ కూలి..ఎకరం పొలం కౌలుకు తీసుకున్నాడు. కుటుంబ అవసరాలకు ఏడాది కిందట రూ.4 లక్షలు అప్పు చేశాడు. అందులో రూ.2 లక్షలు ప్రతి వారం వాయిదా రూ.3 వేలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. అయితే రెండు వారాల కిందట పొలంలో పనిచేస్తుండగా పడిపోవడంతో చేతికి బలంగా గాయమైంది. దీంతో పనులకు వెళ్లలేక ఇంటి వద్దనే ఉండి వైద్యం చేయించుకుంటున్నాడు. దీంతో ప్రతి వారం చెల్లించే వాయిదాల సొమ్ము చెల్లించకపోవడంతో అప్పు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి మొదలైంది. దీంతో మనస్తాపం చెంది గురువారం తన ఇంటిలోనే కలుపు మందు తాగినట్టు కుటుంబీకులు తెలిపారు. వైద్యం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
![]() |
![]() |