మార్చి నెలాఖరుకే ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో ఎండలు మరింత తీవ్రస్ధాయిలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ మార్చి నెలాఖరు 25వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగు తున్నాయి. గరిష్ఠం 38.0, 39.0, 40.0 డిగ్రీల వరకు నమోదయ్యాయి. కనిష్ఠం 21.0, 22.0, 23.0, 24.0 డిగ్రీ లుగా నమోదయ్యాయి. శుక్రవారం గరిష్ఠంగా 40.0 కనిష్ఠంగా 24.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. నగరంలో బయట తిరిగే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఉక్కబోత ఆరంభం కావడంతో ఆపసోపాలు పడుతున్నారు.దీంతో ఉదయం,సాయంత్రం వేళ పను లు ముగించుకుంటున్నారు.మధ్యాహ్నం రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి.వచ్చే నెల ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయి. దీంతో ప్రజలు ఇప్పటి నుంచే భయపడుతున్నారు.