కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.