ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఆయన సతీమణి సునీత వెల్లడించారు. విపక్ష కూటమి ఢిల్లీలో చేపట్టిన సభలో ప్రసంగించిన ఆమె..
ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వివరించారు. వైద్య, విద్యతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. విపక్ష కూటమికి అవకాశమిస్తే గొప్పదేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ చెప్పినట్లు పేర్కొన్నారు.