వైసీపీకి భారీ షాక్ తగలనుంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలువనున్నారు.
ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పల్నాడులోని టీడీపీ కీలక నాయకులతో జంగా కృష్ణమూర్తి భేటీ అయినట్లు సమాచారం.