సామాన్యులకు అదిరిపోయే శుభవార్త. ఏప్రిల్ ఒకటో తేదీ అయిన నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిపోయాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 30.50 పైసలు తగ్గించారు. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎన్నడూ కూడా తగ్గించలేదు చమురు సంస్థలు.దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1764.50 రూపాయలుగా నమోదు అయింది. అలాగే ఐదు కిలోల ఎఫ్ టి ఎల్ సిలిండర్ ధర కూడా 7.50 పైసలు తగ్గిపోయింది. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. అటు గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు చమర సంస్థలు.