పేద మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలను ప్రగతి పథంలో నడిపించుకోవాలంటే ఈ రాష్ట్రానికి మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల విజయశ్రీ అన్నారు. ఆదివారం దొరవారిసత్రం మండలం ఏకొల్లు పంచాయతీలో ఇన్ చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.