అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి ఎం. గౌతమి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ లను బదిలీ చేయాలని మంగళవారం ఈసీ ఆదేశాలను జారీచేసింది. అలాగే బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని కూడా ఆదేశాలునిచ్చింది. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలి అని ఆదేశించారు.