పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలంలోని కోగిర గ్రామంలో వెలసిన గ్రామ దేవత గంగమ్మ దేవతకి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే పూజారి ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు గావించారు అమ్మవారికి ప్రతి మంగళ శుక్ర వారాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మంగళవారం పలు గ్రామాల నుండి పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.