కర్నూలు 8వ వార్డు తెదేపా కార్పొరేటర్ కె. పరమేశ్, శేషగిరి శెట్టితోపాటు మరొకరిని పోలీసులు కౌన్సెలింగ్ పేరుతో పిలిచి ఎందుకు కొట్టారో చెప్పాలని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ డిమాండు చేశారు. మంగళవారం భాస్కరనగర్ లో మాట్లాడుతూ తమ పార్టీ నేతలపై ఎలాంటి కేసులు, రౌడీషీట్లులేకపోయినా ఎందుకు కొట్టారో చెప్పాలి లేకపోతే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.