గ్రామ సచివాలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పారదర్శకంగా పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయంలో పెన్షన్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి పెన్షన్లను పంపిణీ చేస్తామని ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. టోల్ ఫ్రీ- 6300433367ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.