ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో నా నిర్ణయం ప్రకటిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 01:20 PM

టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణయం తర్వాతే తమ నిర్ణ యం తెలియజేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలిపారు. బుధవారం అరసవల్లిలోని తమ స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. మూడు విడతల్లో ప్రకటించిన టికెట్ల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఎంతో ఎంతో ఆవేదనకు, ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. అనంతర పరిణామాలతో పార్టీ అధినేత మమ్మల్ని పిలిపించి మాట్లాడారని, ఇక్కడి పరిస్థితిని వారికి వివరించామన్నారు. నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారని, అంతవరకు వేచి చూస్తామని గుండ దంపతులు స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులు కట్టడం అనేది కేన్సర్‌ వ్యాధిలాంటిదని, గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురిం చిందన్నారు. తమను ఆదరించి, వెన్నంటి నడుస్తున్న అభిమానులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com