స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి మారాయి. కొనుగోళ్ల మద్దతుతో మళ్లీ లాభాల్లోకి మారింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 74,228 వద్ద ముగిసింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 22,515 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.06%), టైటాన్ (1.98%), టెక్ మహీంద్రా (1.74%), ఏషియన్ పెయింట్స్ (1.72%), టీసీఎస్ (1.41%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.52%), భారతీ ఎయిర్టెల్ (-1.44%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.01%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.96%), ఐటీసీ (-0.60%).