పెళ్లికి ముందు ఎందరితో ప్రేమాయణాలు సాగించినా.. పెళ్లి తర్వాత భార్యకు భర్త.. భర్తకు భార్యే సర్వస్వం అవుతుంది. అయితే కొందరు పెళ్లి అయ్యాక కూడా వివాహేతర సంబంధాలు కొనసాగించే వారు ఉన్నారు. భార్య ఉన్నా మరో మహిళతో సహజీవనం చేసేవారు కొందరు అయితే.. భర్త ఉన్నా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం చేసే వారు చాలా మంది ఉంటారు. అయితే మూడో కంటికి తెలియకుండా వీరు గుట్టుగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఇక ఏదో ఒక సందర్భంలో వారి వివాహేతర సంబంధం బయట పడితే.. ఇక వారి సంసారంలో చిచ్చు రేగుతుంది. తమ భాగస్వామి తనతో కాకుండా మరొకరితో జీవిస్తున్నాడని.. పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కిన వారు చాలా మంది ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం కరెంట్ స్తంభం ఎక్కింది. అయితే తన భర్త మరొకరితో సహజీవనం చేస్తున్నాడని అయితే కాదు. తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలని ఆ మహిళ చెప్పడం గమనార్హం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పిప్రాయిచ్ ప్రాంతంలో నివసించే ఓ 34 ఏళ్ల మహిళకు కొన్నేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఆ మహిళ పిప్రాయిచ్‌కు పక్కనే ఉన్న మరో గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత 7 సంవత్సరాలుగా వారి ఇద్దరి మధ్య ఈ ప్రేమాయణం సాగుతుందని స్థానికులు వెల్లడించారు. అయితే ఆ విషయం ఇటీవలె బయటపడింది. భార్య వివాహేతర సంబంధం వెలుగులోకి రావడంతో ఆమె భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే తన భార్యను గట్టిగా నిలదీశాడు. దీంతో జరిగిన విషయం మొత్తం ఆ మహిళ భర్తకు చెప్పింది.
ఈ క్రమంలోనే సరికొత్త వాదనను తన భర్త ముందు ఉంచింది. తనకు భర్త కావాలని అదే సమయంలో ప్రియుడిని కూడా వదులుకోలేనని చెప్పడం గమనార్హం. దీంతో వారిద్ధరి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. భర్త ఎంత చెప్పినా తన భార్య పట్టించుకోలేదు. చివరికి కుటుంబ సభ్యులు చెప్పినా ఆమె పెడచెవిన పెట్టింది. తన ప్రియుడిని కూడా తమతోనే ఉంచుకుందామని.. అలా చేస్తే తమకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా పోతాయని భర్తకు చెప్పింది. తనకు భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలంటూ ఆ భార్య తెగేసి చెప్పేసింది.
భార్య ఎన్ని చెప్పినా.. ఆమె ప్రియుడిని ఇంట్లో ఉంచుకునేందుకు భర్త ఎంతకూ అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ భార్య బెదిరింపులకు దిగింది. తాను చెప్పింది జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో స్థానికులు వచ్చి ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో వారు కరెంట్ సరఫరా నిలిపివేసారు. చివరికి పోలీసులు వచ్చి ఆ మహిళను బలవంతంగా కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa