నాతవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది గ్రామ వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ జె. రాంబాబుకు రాజీనామా లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమను ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురి చేయడంతోనే రాజీనామాలు చేశామన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు.