హిందూపురంలోని బాలాజీ కూడలిలో పోలీసుల తనిఖీల్లో రూ. 5. 20 లక్షల నగదు పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా గురువారం మోడల్ కాలనీకి చెందిన గొంగుల నాగేంద్ర రూ. 5. 20లక్షలు ద్విచక్రవాహనంలో తీసుకెళ్తుండగా సీజ్ చేసినట్లు ఎన్నికల డిప్యూటీ తహసీల్దారెడ్డి శేఖర్ తెలిపారు. అదేవిధంగా లేపాక్షి మండలంలోని చోళసముద్రంటోల్ ఫ్లాజా వద్ద హిందూపురానికి చెందిన రామ్ ప్రసాద్ వద్ద నుంచి రూ. 2. 30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.