ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసని పేర్ని నాని అన్నారు. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని ప్రస్తావించారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు.