వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సచివాలయ వ్యవస్ద ఉపయోగం నేడు చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు తెలిసివచ్చింది. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్ధ ఉద్యోగులతో పెన్సన్ ల పంపిణి చేయచ్చని నేడు వారే చెబుతున్నారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని గత నాలుగేళ్ళుగా విమర్శలు గుప్పించిన వాళ్ళే 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో పెన్సన్ లు పంచవచ్చని అంటున్నారని సజ్జల మండిపడ్డారు.