వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధి కట్టి..మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందామని సూళ్ళూరుపేట వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ.... మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు వలలో, మగ్గాలో, మేకలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్న నాయకుల్ని చూసాం. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే పెత్తందారీ వ్యవస్థకు మూలపురుషుడు చంద్రబాబును చూసాం. బీసీల తోకలు కత్తిరిస్తాం అనే చంద్రబాబు అహంకారాన్ని చూసాం. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మమ్మలన్ని అందరినీ ఆదరించి, మీ అందరి చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు, రాజ్యాధికారం అని..మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజికసాధికారత కల్పించిన ఏకైక పాలకులు సీఎం జగన్ మాత్రమే అని తెలిపారు.