వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు.48 గంటల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. ఈ నెల 1వ తేదీన సీఈఓ కు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్లలో జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై నారా చంద్రబాబు నాయుడు కించపరిచే వ్యాఖ్యలు చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.