గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడే ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైయస్ జగన్‌ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్ చేశారు.