మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ప్రతీ వర్గానికి మంచి చేసే మనం.. మోసం చేసే చంద్రబాబు కూటమితో తలపడతున్నాం. మీ బిడ్డ జగన్ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం. మనం చేస్తున్న మంచిని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయాన్ని ఓడిద్దాం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం మీరంతా సిద్ధమా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు.. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.