విజయవాడ, హెచ్‌బీ కాలనీలో ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయంలో 225 మంది సభ్యులతో కూడిన కేంద్ర, రాష్ట్ర పెన్షనర్లు ఆత్మీయంగా ఈ నెల 9న క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సూరిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. సంఘ కార్యాల యంలో విలేకర్ల సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ రోజు ఉదయం విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఆవంచ వేణుగోపాల రాధాకృష్ణమూర్తి పం చాంగ పఠనం, క్యారమ్స్ విజేతలకు బహుమ తులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా సాలి ఆంజనే యులు(రిటైర్డు ఏపీ జెన్‌కో డైరెక్టర్), అబ్బిలి ఆంజనేయులు (రిటైర్డు ఎంపీడీవో), తెలగరెడ్డి సత్యానందం(రిటైర్డు ఇన్‌కమ్‌టాక్స్ జాయింట్ కమిషనర్)లు హాజరవుతారన్నారు. కార్యద ర్శి సందక కృష్ణ, యెనిగళ్ల సుబ్బారావు, దేవరకొండ శేషగిరిరావులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa