వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. శనివారం నాడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో క్రోసూరులో సభ ఏర్పాట్లను టీడీపీ అభ్యర్థి భాష్య ప్రవీణ్ పరిశీలించారు. సత్తెనపల్లిలో సభా ఏర్పాట్లను టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. సత్తెనపల్లి సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa