మధ్యప్రదేశ్లో శుక్రవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) ఎదురుదెబ్బ తగిలింది. ఖజురహో లోక్సభ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ పరిణామంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మీరా యాదవ్ నామినేషన్ను రద్దు చేయడం ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా హత్య చేయడమేనన్నారు.