జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు అతని సహచరులపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా రాంచీలోని 8.86 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసినట్లు ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. 48 ఏళ్ల జేఎంఎం నేతతో పాటు మరో నలుగురు భాను ప్రతాప్ ప్రసాద్, రాజ్ కుమార్ పహాన్, హిలారియాస్ కచాప్, బినోద్ సింగ్‌లపై మార్చి 30న ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కోర్టు ముందు ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్ ఫిర్యాదును కోర్టు గురువారం పరిగణనలోకి తీసుకుందని ఈడీ తెలిపింది. 8.86 ఎకరాల ప్లాట్‌ను జప్తు చేయాలని ఇడి కోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో సోరెన్‌ను రాంచీలోని తన అధికారిక నివాసంలో విచారించిన తర్వాత జనవరిలో ఈడీ అరెస్టు చేసింది.ప్రభుత్వ అధికారులతో సహా పలువురిపై భూ కుంభకోణం కేసుల్లో జార్ఖండ్ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ దర్యాప్తు జరిగింది.