పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో గుడివాడ ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో రాము పర్యటించారు. కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు. పాతచెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను రాము మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏ వార్డుకు వెళ్లినా త్రాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.