సీఎం జగన్ బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేసిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఇమామ్ లకు రూ.15 వేలు వేతనం, ముస్లిం బ్యాంక్, చనిపోతే రూ.5 లక్షల బీమా వంటి ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరన్న షర్మిల.. కాంగ్రెస్ మాత్రమే ముస్లింలకు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు.