లారీ కిందపడి స్కూటరిస్టు అక్కడిక్కడే మృతి సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కడప జిల్లా, కురబలకోట మండలం ఎనములవారి పల్లెకు చెందిన ఆనంద్ కుమారుడు శ్రీనివాసులు(28) సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో కప్పర కుంట్ల వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో లారీ ఢీకొనడంతో దాని కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కాగా మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ప్రమాదం జరగ డంతో ముదివేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.