ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్, సీపీఐ భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం ఖారారైంది. ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధికారికంగా పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
గుంటూరు పార్లమెంట్ స్థానానికి - జంగాల అజయ్ కుమార్
అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు
విశాఖ పశ్చిమ - అత్తిలి విమల
ఏలూరు - బండి వెంకటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ - జీ కోటేశ్వర రావు
అనంతపురం అర్బన్ - సీ జాఫర్
పత్తికొండ - పీ రామచంద్రయ్య
తిరుపతి - పీ మురళి
రాజంపేట - భూక్య విశ్వనాథ నాయక్
కమలాపురం - గాలి చంద్ర
దీంతో మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, సీపీఐ, సిపిఐ (ఎం) ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను షర్మిల ప్రకటించారు.