తన వెనకాల టీడీపీ ఉందని అందరూ భావిస్తున్నారని.. కానీ, ఏ పార్టీ లేదని వివేకా కుమార్తె సునీత స్పస్టం చేశారు. జగన్, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేసింది వివేకాకు మంత్రి పదవి ఇచ్చినందుకేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవన్నారు. వివేకా హత్య వెనకాల బెంగళూరు లాండ్ సెటిల్మెంట్ కానీ, ఎలాంటి ఇతర కారణాలు లేవని సిబిఐ చెప్పిందని గుర్తు చేశారు. పులివెందులలో వివేకానంద రెడ్డి రాజకీయ పత్రా లేకుండా కుట్ర చేశారన్నారు. ఆయన ఓటును సైతం 2019 ఎన్నికలకు ముందు తొలగించారన్నారు. రేపటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోయినా కూడా తన పోరాటం కొనసాగుతుందని సునీత స్పష్టం చేశారు.