పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. కడపలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్‌లో చేరారు. బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. శుక్రవారం నాడు కూడా పార్టీ కీలక నాయకురాలైన కల్లి కృపారాణి సైతం వైసీపీని వీడారు. వైఎస్ షర్మిలను కలిసి కాంగ్రెస్‌లో చేరారు.