హెరిటేజ్‌కు చెందిన ఐటీ రిటర్న్‌లకు సంబంధించిన పత్రాలు దగ్థం చేసినట్టు తెలుస్తోందని.. రఘురామి రెడ్డి ఆదేశాలు మేరకే హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి అధికారం తథ్యమని తెలడంతో రేపు ఇబ్బంది లేకుండా సాక్ష్యాలు మాయం చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే ఈ డాక్యుమెంట్లు దగ్ధం చేశారన్నారు. డీజీపీ, రఘురామిరెడ్డి ఈ వ్యవహరంపై తక్షణం స్పందించాలన్నారు.