ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు గత నెలలోనే మొదలయ్యాయి. మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దీంతో ఈ వేడుకలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అంబానీ కుటుంబం. అనంత్- అంబానీ- రాధికా మర్చంట్ కొన్ని నెలల్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. వారు దుబాయ్ పర్యటనలో షాపింగ్‌కు సంబంధించిన, విలాసవంతమైన లైఫ్ స్టైల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌లు దుబాయ్‌లో షాపింగ్ చేస్తూ కనిపించారు. ఫుల్ సెక్యూరిటీ కవర్‌తో ఓ మాల్‌కు వచ్చి షాపింగ్ చేశారు. షాపింగ్‌లో కొనుగోలు చేసిన లగేజీ తెచ్చుకునేందుకు వారు సుమారు రూ.25 కోట్లు విలువైన కార్ల కాన్వాయ్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఏకంగా 20 లగ్జరీ కార్లను షాపింగ్ కోసం వినియోగించడంతో నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారి కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కలినాన్ బ్లాక్ బ్యాడ్జ్ తో పాటు పలు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కోసం ఆ కార్ల కాన్వాయ్‌లో ఒక అంబులెన్స్ సైతం ఉంచడం గమనార్హం.
కన్వాయ్‌లో ఆరెంజ్ కలర్ కలినాన్ తో పాటు తెల్లరంగు కలినాన్ కారు సైతం ఉంది. సెక్యూరిటీ కోసం ఉపయోగించిన ఎస్‌యూవీలు, కాడిలాక్ ఎస్కెలేడ్స్, జీఎంసీ యుకాన్ డెనిలిస్, చావ్రోలెట్ సబర్బన్స్ ఉన్నాయి. ఆ కార్లలో మొత్తం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో రోల్స్ రాయిస్ కలినాన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ప్రారంభ ధర రూ.8.20 కోట్లుగా ఉంది. అంబానీ కార్ల గ్యారేజీలో ఇలాంటి కార్లు చాలానే ఉన్నాయి. గుజరాత్ లోని జామ్ నగర్‌లో అనంత్- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకల జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ షాపింగ్ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న అనంత్ అంబానీకి రాధికా మర్చంట్‌తో కొన్నేళ్ల పరిచయం ఉంది. 2022లో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధ్రువీకరించాయి. 2023, జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జులైలో వారి వివాహం జరనుంది.