ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సీఐడీ సిట్ అధికారులు భావించారని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా హెరిటేజ్‌కు చెందిన డాక్యుమెంట్లు తగలబెట్టారని వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ డాక్యూమెంట్లు దగ్ధంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిట్ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి గత అయిదేళ్ల నుంచి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఆయన ఆదేశాల ప్రకారమే అధికారులు హెరిటేజ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు దగ్ధం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా శిక్షర్హులు అవుతారన్నారు. ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టారు అనేది వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పత్రాల దగ్థంపై డిజి, సిట్ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని అన్నారు.