స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 152 పాయింట్లు పుంజుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (3.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.22%), ఎన్టీపీసీ (2.54%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.39%), ఎల్ అండ్ టీ (1.92%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-1.59%), విప్రో (-1.09%), సన్ ఫార్మా (-0.51%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (-0.37%), టైటాన్ (-0.32%).