మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు. సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ కి టీడీపీ, షర్మిల, సునీతలపై దస్తగిరి ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కోరారు.