ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంక్షేమం కోసమే ప్రజా మ్యానిఫెస్టో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 09:18 PM

ప్రజా సంక్షేమం, ఏపీ అభివృద్ధే కూటమి లక్ష్యమని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందించడమే కూటమి లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనేనని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దుర్యోధన, నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా మ్యానిఫెస్టోను తయారు చేస్తున్నామన్నారు. విద్రోహ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాక్షస సంహారానికి త్రిమూర్తులుగా కూటమి జనం ముందుకు వస్తుందన్నారు. ప్రజా మ్యానిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని లంకా దినకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com